ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) హైదరాబాదులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కించపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదని దళిత నాయకుడు శనిగారపు రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, మంగళవారం ఆయన మాట్లాడుతూ సహచర మంత్రి అని చూడకుండా విలేకరుల ముందు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కించపరిచే విధంగా మాట్లాడడం శోచనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ బేషరతుగా మాదిగ సామాజిక వర్గానికి వెంటనే క్షమాపణలు చెప్పకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Post Views: 648



