హుజూర్ నగర్ (తెలంగాణ వాణి) హుజూర్ నగర్ పరిధి ముక్త్యాల కెనాల్ కాలువ ప్రక్కన గుట్టమీద స్వయంభుగా వెలసిన శ్రీ పడగరాయ గుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆ స్వామి మహిమలు అంతా ఇంతా కాదు పల్లె పల్లెనా గ్రామ గ్రామాన మారు మ్రోగు తున్న నామస్మరణం నరసింహునిది ఆ స్వామి మహిమలు చూడ ప్రజల తాండోపతండపగా తరలివస్తున్నారు ప్రతి శుక్రవారం స్వామి వారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అన్నదానం దాతమాదాల వీరబాబు లక్ష్మి దంపతులు కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం, కొత్తగూడెం వాస్తవ్యులు 25 కేజీల బియ్యం దాత శ్రీనివాసగణేష్ ఉత్సవ కమిటీ గోవిందపురం వాస్తవ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయటం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ఈ ప్రాంతం లో స్వామి స్వయంభుగా వెలవడం ఈ ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టవంతులని అదేవిధంగా అన్నదానం చేయడం ద్వారా ధన ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని వారు తెలియజేశారు ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ భక్తులు పండుగ తరలిరావడం ఎంతో ఆనందదాయకమని అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు శాగం రెడ్డి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొనుగుపాటి వెంకటేశ్వరరావు, కోశాధికారి గుర్రం చిన్న వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు తోడేటి సర్వయ్య, వీరవల్లి కోటేశ్వరరావు, గురునాథం, నాగరాజు, శంకరమ్మ, అమ్మరోజి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
