ఖమ్మం (తెలాంగాణ వాణి) మ్యాజిక్ కళా రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డును ఖమ్మం వాసి షేక్ మాయ మస్తాన్ అందుకున్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి 2025 -2026 అంతర్జాతీయ తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు హైదరాబాద్ శ్రీ త్యాగరాయ కళావేదిక లో జరిగాయి . ఈ అవార్డును తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజకుమార్ చార్యులు , తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు , ప్రముఖ జ్యోతిష్య నిపుణులు దైవజ్ఞ శర్మ గురువు , తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ చారి లు అందించారు . ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మస్తాన్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి మ్యాజిక్ రంగంలో మ్యాజిక్ ని కష్టపడి నేర్చుకున్నానని , వారిది వీధి గారడి చేసుకునే కుటుంబంలో నుంచి వచ్చానని , నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి మ్యాజిక్ ఐటమ్స్ నేర్చుకొని మ్యాజిక్ రంగంలో అందరూ మెచ్చుకునే విధంగా ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రోగ్రామ్స్ చేస్తున్నానని అన్నారు . తన ప్రతిభను చూసి పెద్దలు మహానంది అవార్డును ఇచ్చారని తెలిపారు . మరికొన్ని మ్యాజిక్ సామాన్లు కొనుక్కొని ఇంకా చాలా ప్రోగ్రాలు చెయ్యడానికి ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం లోన్స్ ఇప్పించాలని కోరారు .
