UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 పిండివంటలు, బేకరి వ్యాపారం చేస్తాం అనుమతి ఇవ్వండి

14వ వార్డు డ్వాక్రా మహిళల విజ్ఞప్తి 

కొత్తగూడెం (తెలంగాణ వాణి) మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు డ్వాక్రా మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం ముందు పిండివంటలు, బేకరి కోసం కంటేనర్ పెట్టుకునేందుకు తమకు అవకాశం ఇప్పించవలసినదిగా మున్సిపల్ కమీషనర్ కు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ గతంలో మున్సిపల్ కమీషనర్, చైర్మన్, కౌన్సిలర్స్ ను కార్యాలయం ముందు కంటేనర్ ఏర్పాటుకు అనుమతి కోరగా రోడ్డు డ్రైన్స్, కాల్వలు మరమత్తులు ఉన్నాయని కొంత వేచి ఉండాలన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ స్థలంలో వేరే వారు కంటేనర్ పెట్టారని, కంటేనర్ పెట్టిన వారిని అడిగితే కార్పొరేషన్ అధికారులు తనకు పర్మిషన్ ఇచ్చారని అనడంతో, తాము కార్యాలయంలో అడుగగా అతనికి పర్మిషన్ ఇవ్వలేదని, అక్కడి నుండి అతనిని తొలగిస్తామని తెలిపినప్పటికి ఇప్పటికి అతను అక్కడే కొనసాగుతున్నారని, కార్పొరేషన్ కార్యాలయం ముందు పిండివంటలు, బేకరి కోసం కంటేనర్ ఏర్పాటు చేసుకున్నామని తమకు అనుమతి ఇప్పించవలసినదిగా ఆవేదన వ్యక్తం చేశారు.

14వార్డు మహిళలకు న్యాయం జరిగేనా !!??

ఓ వైపు ఇందిరమ్మ రాజ్యంలో మహిళల అభ్యున్నత్తి కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తో సహా కేబినెట్ మంత్రులు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు స్పష్టంగా ప్రకటనలు చేస్తుంటే కొత్తగూడెం కార్పొరేషన్ అధికారులు మాత్రం కనీసం మహిళల వినతిపత్రం తీసుకునేందుకు కూడ సుముఖత చూపకపోగ వారి ఆవేదన వినేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest