మెట్‌పల్లి (తెలంగాణ వాణి)
మండలంలోని వేంపేట గ్రామానికి చెందిన రాచర్ల అంజయ్యకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేసి కరవగా 22 గొర్రెలు మృతి చెందాయి. ఆరు గొర్రెలకు తీవ్ర గాయాల పాలవగా విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి పశు వైద్యాధికారికి, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి వచ్చి 22 గొర్రెలు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆరు గొర్రెలకు తీవ్ర గాయాలు అవ్వగా పశు వైద్య సిబ్బంది చికిత్సను అందించారు. పశు వైద్యాధికారి డాక్టర్ మనీషాతో పాటు మండల రెవెన్యూ అధికారి కాంతయ్య, పశు వైద్య సిబ్బంది బి రవి, రమాదేవి, మోహన్, భూమాచారి ఉన్నారు.
Post Views: 426