ప్రజానాయకుడు పొంగులేటి పై విషప్రచారమా
తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు
నోరు అదుపులో పెట్టుకోక పోతే ఇళ్లను ముట్టడి చేస్తాం
రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ
కొత్తగూడెం (తెలంగాణ వాణి) వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245 వ్యవసాయ భూమిలో జరుగుతున్న భూ వివాదానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వారి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు తాము ఏలాంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయలేదని వట్టినాగులపల్లి యజమానులు స్పష్టంగా చెప్తున్నప్పటికీ బిఆర్ఎస్ నాయకులు కావాలనే విషప్రచారం చేస్తుండంపై రేగళ్ల పెద్ద తండా సర్పంచ్ లావుడ్య పూర్ణ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చించాల్సిన ప్రజా ప్రతినిధులు, చిల్లర వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తు కేవలం కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బ తీసేలా తప్పుడు ప్రచారం చేయడం మాజీ మంత్రులు కేటిఆర్, హరీష్ రావు ల అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. అనవసర వివాదంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ని, రాఘవ కన్స్ట్రక్షన్స్ ని లాగి నిందారోపణలు చేస్తే బిఆర్ఎస్ నేతల ఇళ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.