UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో కరెన్సీపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుపూలే 135వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారని ఈయన పూర్తి పేరు మహాత్మ జ్యోతిరావు పూలే, అణిచి వేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారికి సాధికారత కల్పించడంలో ఎంతో కృషి చేసిన సామాజిక సంఘ సంస్కర్త విద్యావేత్త పూలే అని కొనియాడారు. హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని అంకితం చేశాడని ఈ సందర్భంగా అన్నారు. ఆది నుంచి కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూనే మహిళా విద్య కోసం ఎనలేని కృషి చేశాడని స్త్రీలు సమానత్వం పొందాలంటే విద్య తప్పని సరని విశ్వసించి 1948వ సంవత్సరములో పూణేలో బాలికల కోసం తొలిసారిగా పాఠశాలను స్థాపించారని ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం140 పాఠశాలను ప్రారంభించారని పూలే దంపతులు బాల్య వివాహాలకు ప్రతికూలంగా ఉంటూనే వితంతు పునర్వివాహానికి మద్దతుగా నిలిచిన ఘనత వారిదేనని ఈ సందర్భంగా బొల్లి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టి జి పి ఏ) రాష్ట్ర నాయకులు ధార మధు, వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్ కాంపల్లి రాజేశం, టి జి పి ఏ జిల్లా నాయకులు సుంచు మల్లేశం, దళిత సంఘ నాయకులు ఇరుగురాల రాజనర్సు, సిలుముల రాజ మల్లయ్య, దూడ లచ్చయ్య, బహుజన నాయకులు గుండా గంగయ్య, మదన్మోహన్, రామగిరి లింగయ్య, ఉప్పులేటి రాజేశం, కాంపల్లి సతీష్, గాజుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest