ధర్మారం (తెలంగాణ వాణి)
గత కొంతకాలంగా పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం, సుల్తానాబాద్, పొత్కపల్లి మండలాలలో వివిధ గ్రామాల్లోని పలు దేవాలయాలలో ఉన్న హుండీలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న కూకట్ల సదానందం ను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతను దేవాలయాలలోని హుండీలే లక్ష్యంగా చేసుకొని వాటిని పగలగొట్టి అందులో ఉన్నవి దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సదానందం ధర్మారం మార్కెట్ యార్డ్ వద్ద తచ్చాడుతుండగా అతన్ని స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తన పోలీసు సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు పంపినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Post Views: 1,649