UPDATES  

 హరీష్ రావు బృందాన్ని విడుదల చేసిన కేశంపేట పోలీసులు

హైదరాబాద్ (తెలంగాణ వాణి బ్యూరో)

గత మూడు గంటలుగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరుల అరెస్టు సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న  ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. మంత్రి హరీష్ రావు తదితర బృందాన్ని కెశంపేట పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత వదిలేశారు. దీంతో హరీష్ రావు తదితరులు తమ వాహనాల్లో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తనను అరెస్ట్ చేసిన సమాచారాన్ని తెలుసుకొని తమకు అండగా నిలిచిన టిఆర్ఎస్ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఆయన ధన్యవాదాలు తెలిపారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest