ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
ధర్మారం (తెలంగాణ వాణి) జిఎస్టి తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కొరకు జిఎస్టి తగ్గించడం పట్ల మండల కేంద్రంలో వాణిజ్య వ్యాపారులతో కలిసి బిజెపి నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేడవెని శ్రీనివాస్, సంధినేని లక్ష్మణ్, కొలిపాక మణికంఠ, గోనె సాయికృష్ణ, దేవి రాజలింగు, సురకంటి తిరుపతిరెడ్డి, లడ్డు, నాడెం మల్లేశం, మల్యాల వెంకటేష్, సబ్బు శేఖర్, వన్నెల బాల్రెడ్డి, గంట రాజిరెడ్డి, పానుగంటి సాయి కృష్ణ, మేడ వేణి శరత్, బోరే హరీష్, మేడ వేణి మహేష్, సాయి, శ్రీనివాస్, కార్తీక్, వ్యాపారవేత్తలు, బిజెపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



