రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు తొలగింపు
ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) సమిష్టి కృషితో సాధ్యం కానిది ఏది లేదనే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపారు ఆ గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామానికి వెళ్లే దారికి ఇరువైపుగా ఏపుగా పెరిగిన చెట్లను, పిచ్చి మొక్కలను కంప చెట్లను తొలగించెందుకే శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు పెరిగడంతో పది రోజులుగా కుమ్మరి కుంట వయా కొత్తూర్, న్యూ కొత్తపల్లి, చామనపల్లి గ్రామాల మీదుగా ధర్మారం మోడల్ స్కూల్, ధర్మారం వెళ్లే బస్సు రావడం నిలిపివేయడంతో స్కూల్ కి వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారని రెండు రోజులుగా చామనపల్లి కొత్తపల్లి న్యూ గ్రామాల ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను శ్రమదానం చేసి తొలగించారు. దీంతో పాటు కొత్తూరు నుండి చామనపల్లి మీదుగా కటికనపల్లి వరకు ఉన్న రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల మండలను పిచ్చి మొక్కలను తొలగించి వాహనాదారులకు ఇబ్బంది లేకుండా చేశారు. కటికనపల్లి మాజీ ఉపసర్పంచ్ రామడుగు గంగారెడ్డి చెట్ల మండలను తొలగించేందుకు తన సొంత జెసిబి ని ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నాగరాజు, న్యూ కొత్తపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ అయితర వేణి రమేష్, సురేందర్, తిరుపతి ,శివ, నరసయ్య, లచ్చయ్య , సంపత్ సంధినేని సంతోష్, కూనారపు రాములు, సుందరగిరి చందు తో పాటు రెండు గ్రామాల ప్రజలు యువకులు పాల్గొన్నారు.