UPDATES  

NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

 కొత్త ఒరవడికి సీఎం నాంది ! నిమజ్జన వేడుకల్లో రేవంత్

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. మంగళవారం ఉదయమే మహాగణపతి శోభయాత్ర మొదలైంది. ఆ బొజ్జ గణపయ్య అడుగడుగునా భక్తుల పూజలందుకుంటూ ముందుకుసాగుతున్నాడు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో బడా గణేష్‌ శోభాయాత్ర సాగుతోంది. బడా గణేష్ ముందు చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ గణపయ్యను నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిమజ్జనం కోసం బడా గణేష్ ఒడిఒడిగా హుస్సేన్ సాగర్‌వైపు వెళ్తున్నారు. ఇప్పటికే ఆ మహాగణపతి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నాడు.

 

ఎన్నడూ చూడని విధంగా…

 

మరోవైపు ఎన్నడూ చూడని విధంగా ఈసారి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాసేపటి క్రితమే సీఎం ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నారు. రేవంత్‌ను చూసిన ప్రజలు కేరింతలు కొడుతున్నారు. తన వాహనం లోపల నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. సెక్రటేరియెట్ సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం స్వాగతం పలుకనున్నారు. తెలుగుతల్లి ప్లైఓవర్ కింద నుంచి క్రేన్ నెంబర్ 4 దగ్గరకు రేవంత్ రెడ్డి వెళ్లారు. నిమజ్జన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే తొలిసారి. సీఎం రాకతో అక్కడ రోడ్డును భద్రతా సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. అంతకు ముందు జూబ్లీహిల్స్ నివాసం నుంచి గన్‌పార్క చేరుకున్న ముఖ్యమంత్రి.. అమరవీరులకు నివాళులర్పించారు. ఆపై ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వేల సంఖ్యలో భక్తులు..

 

అలాగే బడా గణేష్ నిమజ్జనం నేపథ్యంలో సచివాలయం – ఎన్టీఆర్ మార్గ్ భక్తులతో నిండిపోయింది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వేల సంఖ్యలో వస్తున్న భక్తులను కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest