బెల్లంపల్లి (తెలంగాణ వాణి)
డ్రై డే–ఫ్రై డే కార్యక్రమంలో భాగంగా హనుమాన్ బస్తి -28వ వార్డులో డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చేయించారు. ఇంటీంటికి వెళ్ళి ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలిగించాలని, పాత పాత్రలలో, టైర్ లలో నీరు నిల్వకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుబ్రముగా ఉంచుకోవాలని చూచనలు చేసి, జెసిబి తో పెద్ద కాలువలు తీయించి పిచ్చి మొక్కలు తొలిగించారు. ఈ కార్యక్రమముల చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, కమీషనర్ కె శ్రీనివాసరావు, స్థానిక వార్డు కౌన్సిలర్ కేంశెట్టి సరిత శ్రీనివాస్, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం, ఎన్విరాన్మెంట్ ఇంజీనీర్ సంతోష్ , టిఎంసి దుర్గయ్య, ఆర్ పి లు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 105