బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) సోనాల మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలొ పిల్లలు రకరకాల ఆహార పదార్థాలను వారి కుటుంబ సభ్యుల సహకారంతో తయారుచేసుకొని వచ్చి పాఠశాలలో ఏర్పాటు చేయబడినటువంటి స్టాల్స్ లో అమ్మకం చేయడం, పోషకులు విద్యార్థులు ఉత్సాహంగా స్టాల్స్ తిరుగుతూ ఆహార పదార్థాలను కొని రుచి చూసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సోనాల పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ కుంట నవీన్ రెడ్డి విద్యార్థులు తయారు చేసినటువంటి స్టాల్స్ ను పరిశీలించి ఆహార పదార్థాలను రుచి చూస్తూ పదార్థాల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నాణ్యమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య, ఓరుగంటి ఇస్తారి, కచ్చకాయల అవినాష్, ఉపాధ్యాయ బృందం పోషకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 351