UPDATES  

 ఈటెల రాజేందర్ కొత్తగూడెం పర్యటన వాయిదాకు కారణమేంటి

జిల్లా నాయకుల మధ్య విభేదాలా ?

అగ్రకుల నాయకుల రాజీనామా బెదిరింపులా ?

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

అగ్రకులాల బెదిరింపులతో బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీ గొంతు మూగబోయిందా. ఇప్పుడు ఇదే విషయం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో చర్చనియాంశంగా మారింది. బీజేపీ జిల్లా పార్టీలో ఇలాంటి ఘటనల వల్ల పార్టీ పరువు పోవడం ఖాయమన్న సంగతి కూడ మర్చిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీ గొంతుక, జాతీయ నాయకుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గొంతును భద్రాద్రి జిల్లాలో వినపడకుండా చేసారని పార్టీ నేతలు కొందరు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బీసీ అగ్రనేతకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ బహుజనుల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. రాజీనామా చేస్తామన్న కొందరు అగ్రకుల నాయకుల మాటకు విలువిచ్చి ఈటెల పర్యటనను మార్చేసిన పార్టీ అధిష్టానంపై భద్రాద్రి బహుజన నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest