UPDATES  

 భద్రాద్రి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

చేయని తప్పుకు బలి పశువును చేశారు
అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన 
బూర్గంపహాడ్ (తెలంగాణ వాణి)

గతంలో గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్న ఘటన జిల్లా పోలీస్ యంత్రాంగంలో కలకలం రేపింది. బూర్గంపహాడ్ ఎస్సై, బిఆర్ఎస్ నాయకుడు, ఏఎస్సై లు చేసిన పనికి తనని బలి పశువు చేసారని, చేయని తప్పుకు పడ్డ నింద తట్టుకోలేకపోతున్నానని, భార్య, తండ్రికి సెల్ఫీ వీడియో పంపి పురుగుల మందు తాగిన కానిస్టేబుల్ సాగర్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గంజాయికి సంబంధించిన కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపణలు చేస్తూ సూసైడ్ వీడియో రిలీజ్ చేయడం పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ప్రస్తుతం కానిస్టేబుల్ ను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest