UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి)

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని మిగిద్దో మినిస్ట్రీస్ చర్చికితో పాటు పలు చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇతరుల పట్ల ప్రేమ సహనం శాంతి సేవాభావం ద్రాత్రుత్వమనే సుగుణాల ఆచరణలో మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఆయన గొప్ప దేవుడనికొనియాడారు, ఆయన కృప ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రి కి ఉండాలని కోరారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. శాసనసభ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గంలోని ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. పాస్టర్ దేవి జాన్ నెల్సన్ ప్రపంచ శాంతిని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీటీసీ తోడేటి రాజ లింగయ్య గౌడ్, ఓరెమ్ చిరంజీవి, బెక్కం జనార్ధన్, ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest