ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి వేడుకలకు మేడారం మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ లు గుర్రం మోహన్ రెడ్డి పాలకుర్తి రాజేశం గౌడ్ అల్వాల రాజేశం హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశ్ ముక్ ల పై తిరుగుబాటు చేసి భూ పోరాటానికి నాంది పలికారని అలాంటి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాడెం శ్రీనివాస్, గాజుల రాజు, రామారావు, ఎండి అష్రఫ్, కరేటి వేణు, ఆవుల శ్రీను, వేణు, నలిని కాంత్, రజక సంఘం నాయకులు నర్సింగం, గౌరయ్య , రాజేశం, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.