లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
లక్ష్మీదేవిపల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా మాజీ సర్పంచ్ తాటి పద్మ ఆద్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ మేరకు మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ప్రకృతితో మమేకమై సంతోషంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ప్రజలు యువతి యువకులు అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాటి పద్మ, మాడిశెట్టి పద్మ,అనిత,అంగన్వాడి టీచర్ అంజమ్మ,స్థానిక మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల

హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణలో పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు భారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల […]
ఘనంగా ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి వేడుకలకు మేడారం మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ లు గుర్రం మోహన్ రెడ్డి పాలకుర్తి రాజేశం గౌడ్ అల్వాల రాజేశం హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. […]
పూర్తిస్థాయిలో భాజపా మండల కమిటీ నియామకం : సతీష్ రెడ్డి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొమ్ము రాంబాబు దేశాల మేరకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ ధర్మారం మండల శాఖ కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో నియమించినట్లు ఆ శాఖ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి విలేకరులకు తెలిపారు. మండల ఉపాధ్యక్షులుగా కర్రే లక్ష్మణ్, […]
హుండీ దొంగను పట్టుకున్న ఎస్సై ప్రవీణ్ కుమార్

ధర్మారం (తెలంగాణ వాణి) గత కొంతకాలంగా పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం, సుల్తానాబాద్, పొత్కపల్లి మండలాలలో వివిధ గ్రామాల్లోని పలు దేవాలయాలలో ఉన్న హుండీలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న కూకట్ల సదానందం ను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతను దేవాలయాలలోని హుండీలే లక్ష్యంగా చేసుకొని వాటిని పగలగొట్టి అందులో ఉన్నవి దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సదానందం ధర్మారం మార్కెట్ […]

ఏకాత్మతా మానవతా వాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రం – అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ సెప్టెంబర్ 25: (తెలంగాణ వాణి ప్రతినిధి) ఏకాత్మతా మానవతా వాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రం అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, మారుతీ నగర్ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అర్ముర్ ఎమ్మెల్యే […]
ఆదర్శ పాఠశాల విద్యార్థుల వృత్తి వ్యాయామ విద్య ఇంటర్ను షిప్ కార్యక్రమం

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం ఆదర్శ పాఠశాల కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు వృత్తి వ్యాయామ విద్యకు సంబంధించి ఇంటర్నె డు శిక్షణ తీసుకుంటున్నారని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఈరవేణి తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర శిక్ష ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ వ్యాయామ విద్య లెవెల్ నలుగురు విద్యార్థులు ఈ నెల 22 నుండి అక్టోబర్ 1 వరకు పది రోజుల […]
పిండివంటలు, బేకరి వ్యాపారం చేస్తాం అనుమతి ఇవ్వండి

14వ వార్డు డ్వాక్రా మహిళల విజ్ఞప్తి కొత్తగూడెం (తెలంగాణ వాణి) మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు డ్వాక్రా మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం ముందు పిండివంటలు, బేకరి కోసం కంటేనర్ పెట్టుకునేందుకు తమకు అవకాశం ఇప్పించవలసినదిగా మున్సిపల్ కమీషనర్ కు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ గతంలో మున్సిపల్ కమీషనర్, చైర్మన్, కౌన్సిలర్స్ ను కార్యాలయం ముందు కంటేనర్ ఏర్పాటుకు అనుమతి కోరగా రోడ్డు డ్రైన్స్, కాల్వలు మరమత్తులు ఉన్నాయని కొంత […]
జిఎస్టి తగ్గింపుపై హర్షం

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం ధర్మారం (తెలంగాణ వాణి) జిఎస్టి తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కొరకు జిఎస్టి తగ్గించడం పట్ల మండల కేంద్రంలో వాణిజ్య వ్యాపారులతో కలిసి బిజెపి నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్టు తెలిపారు. […]
కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50శాతం పైగా కోత విధించారని కాపు కృష్ణ ఆగ్రహం

కొత్తగూడెం సింగరేణి (తెలంగాణ వాణి) ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలొ మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు గడిస్తే, కేవలం 2360 కోట్లలో 34శాతం ఇవ్వడం ఏమిటని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ ప్రశ్నించారు. సోమవారం టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దసరా పండుగ పూట కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి చేదు కబురు చెప్పారని […]