జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంగ మహేందర్
ధర్మారం (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు చెందిన రిజర్వేషన్ల ను అడ్డుకున్నందుకు నిరసనగా బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు వ్యాపార వాణిజ్య సంస్థలు సంపూర్ణ మద్దతు తెలుపాలని జాతీయ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి జంగ మహేందర్ కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసినప్పటికీ అట్టి జీవో పై హైకోర్టు స్టే విధించడం అత్యంత బాధాకరమని ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు నోటి కాడి ముద్ద లాగేసినట్టు భావావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనదని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఎన్నికల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మసానం పై బీసీలందరికీ అపారమైన నమ్మకం ఉందని ఆయన అన్నారు. బీసీలు అందరు కలిసి రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలు తెలిపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు దేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా కలిగిన మనము మన వాటా ఏందో ఎంతో తెలుసాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాలు అన్ని ఈ రోజు ఏక తాటి పై వచ్చి బంద్ కి పిలుపునిచ్చారన్నారు.