ఖమ్మం (తెలంగాణ వాణి ప్రతినిధి హనిఫ్ పాషా) బీజేపీ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్త పేర్కొన్నారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షునిగా తనను నియమించిన పార్టీ అధినాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు తనకు పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించడం తనకు ఒక గొప్ప అవకాశం అని, ఈ ఎన్నికల్లో బిజేపీ సత్తా ఎంటో చూపించాల్సిన ఆవశ్యకత కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తనతో పాటు మిగితా కార్యవర్గంపై ఉందన్నారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహ మంత్రి బండి సంజయ్, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్ శీలం పాపారావు వాకధాని పుల్లారావు పాటు ఇతర అదినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన శక్తి మేరకు పార్టీ పటిష్టతకు, స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.



