రాజకీయ గురువుల ఆశీస్సులతోనే పోటీ
బిఆర్ఎస్ బలపరిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తాళ్ల సుధారాణి
తల్లాడ (తెలంగాణ వాణి) మండలంలో గోపాల పేట గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయతోనే రాజకీయంగా అడుగులు వేశానని. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి. తెలంగాణ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్, ఆశీస్సులతోనే . గోపాల్ పేట కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ అభ్యర్థి తాళ్ల సుధారాణి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక రెండేళ్ల కాలంలోనే ఎమ్మెల్యే మట్ట రాగమయి, సహకారంతో గ్రామంలో సుమారు పది లక్షల గ్రాంటును తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేశామని . 70 లక్షల గ్రాంటు తీసుకొచ్చి సుమారు గ్రామంలో అన్ని సిసి రోడ్డులుగా మార్చాము గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు పది తీసుకొచ్చాము ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారని. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆర్ గ్యారంటీల పథకాలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి ,ఇందిరమ్మ చీర ల పంపిణీ లబ్ధిదారులకు అందాయని తెలియపరిచారు. అలాగే గ్రామంలో ఎస్సీ బీసీ కాలనీలో స్మశాన వాటికలకు సీసీ రోడ్లు డ్రైనేజీ సమస్య పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే మట్టా రాగమై దయానంద్ ఆశీస్సులతోనే గోపాలపేట గ్రామ పంచాయతీ గ్రామ నాయకుల సహకారంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేసి కృషి చేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో పోటీకి దిగుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమై దయానంద్ దయ ఉన్నంతవరకు స్థానిక ప్రజలు చేయూతనిస్తారని .ఆదరించి గ్రామ సర్పంచిగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు హాజరయ్యారు.

