ఖమ్మం ఆర్టీసీ దసరా స్పెషల్ లక్కీ డ్రా

ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) దసరా పండుగ నేపథ్యంలో, ప్రయాణీకులను ఆకర్షించేందుకు – ప్రయాణీకుల ఆదరణను పెంచుకోవడానికి తెలంగాణా రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ప్రకటించిన లక్కీ డ్రా ను ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ పరిధిలో ఈరోజు ఖమ్మం నూతన బస్టాండ్ లో ప్రయాణీకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సదరు లక్కీ డ్రా ను నిర్వహించి విజేతలను ప్రకటించడం జరిగింది. విజేతల వివరాలుఇలా […]
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిర్సే సంజీవ్ బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిర్సే సంజీవ్ గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిర్సే సంజీవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నానని, పార్టీలో ఉండి ప్రజలను పార్టీ చేస్తున్న మోసాలు […]
ఆటో కార్మికులను ఆగం చేసిన కాంగ్రెస్ – దాస్యం వినయ్ భాస్కర్
ఖాజీపేట రైల్వే స్టేషన్ ఆటోయూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం…. బాకీ కార్డులను విడుదల చేసిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలంగాణ వాణి,ఉమ్మడి వరంగల్ బ్యూరో, (అక్టోబర్ 8) : కాంగ్రెస్ నాయకులను ఎక్కడపడితే అక్కడ నిలదీయాలని ప్రభుత్వ మాజీ చీప్ విప్ ,బి ఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.హనుమకొండ లోని కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన […]
ఖిలవనపర్తి గ్రామాన్ని ఎస్సీలకు కేటాయించాలని కలెక్టర్ కు వినతి పత్రం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామంలోని దళితులు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేయడానికి అనర్హులుగా మారారు. 2011 జనాభా లెక్కల సర్వే లో ఆ గ్రామంలో ఎస్సీలు 400 ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు . కంప్యూటర్ నమోదులో 400 అంకెలలో రెండు సున్నాలను తొలగించి ఒక పురుషుడు ముగ్గురు స్త్రీలు ఉన్నట్లుగా మొత్తం నలుగురు ఎస్సీ జనాభా ఉన్నట్లు నమోదు చేయడంతో నాటి […]
ఘనంగా టీజిపిఏ ఆవిర్భావ దినోత్సవం

పెద్దపల్లి (తెలంగాణ వాణి విలేకరి) బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడలిలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజిపిఏ) వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదయ్య ఆదేశాల మేరకు టీజీపీఏ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి సీలుముల సంజీవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద టీజీపీఏ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ.. తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపిఏ) […]
ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ను అభినందించిన AMC డైరెక్టర్ హరి నాయక్
ప్రకృతి పరిరక్షణలో అసాధారణ కృషి చేస్తున్న ఉపాద్యాయులు ప్రకృతి ప్రేమికుడు ఉపాద్యాయులు బాలు నాయక్ ను తెరాస పార్టీ సీనియర్ నాయకులు AMC డైరెక్టర్ హరి నాయక్ అభినందించారు.మొక్కల నాటడం,పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం జాతీయ యంగ్ ఇండియన్ సేవా పురస్కారం అందుకున్నరని తెలిపారు.ఈ సందర్భంగా AMC డైరెక్టర్ హరి నాయక్ మాట్లాడుతూ.. హరిత వాతావరణం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు
దోమల నివారణకు పైరిత్రం పిచికారీ…పాల్గొన్న వైద్య సిబ్బంది
పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద ఉన్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో మంగళవారం దోమల నివారణ చర్యల్లో భాగంగా పైరిత్రం పిచికారీ చేశారు.వైద్యాధికారులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దోమకాటు వల్ల మలేరియా,డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవేందర్ నాయక్, సబ్ యూనిట్ ఆఫీసర్ జేతురాం, […]
అనుమానాస్పద స్థితిలో గురుకుల విద్యార్థి మృతి..!

జిల్లెలగడ్డ గ్రామ శివారులోని గురుకుల పాఠశాలలోని ఘటన శోక సముద్రంలో మునిగిన తల్లితండ్రులు… హుస్నాబాద్: అక్టోబర్ 7 తెలంగాణ వాణి రూరల్ ప్రతినిది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి వివేక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దసరా సెలవుల అనంతరం వివేక్ ఈనెల 6న తిరిగి పాఠశాలకు వచ్చాడు. మంగళవారం ఉదయం పాఠశాల భవనం రెండో అంతస్తు కారిడార్లో ఆడుకుంటున్న సమయంలో అక్కడ […]
మంత్రి అడ్లూరికి పొన్నం బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) హైదరాబాదులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కించపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదని దళిత నాయకుడు శనిగారపు రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, మంగళవారం ఆయన మాట్లాడుతూ సహచర మంత్రి అని చూడకుండా విలేకరుల ముందు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కించపరిచే విధంగా మాట్లాడడం శోచనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ బేషరతుగా […]
బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులుగా వీరవెల్లి రాజేష్ గుప్తా

ఖమ్మం (తెలంగాణ వాణి ప్రతినిధి హనిఫ్ పాషా) బీజేపీ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్త పేర్కొన్నారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షునిగా తనను నియమించిన పార్టీ అధినాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు తనకు పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించడం తనకు ఒక గొప్ప అవకాశం అని, ఈ […]