UPDATES  

NEWS

బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాభివృద్ధి : మద్దెల సుధీర్ ఆదరించండి.. అభివృద్ధి చేస్తా : వజ్జా ఈశ్వరి భూసమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే ఓటు అవకాశం ఇవ్వండి రుణం తీర్చుకుంటా ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్

 ఆదరించండి.. అభివృద్ధి చేస్తా : వజ్జా ఈశ్వరి

ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఐ పార్టీ సర్పంచి అభ్యర్థి

ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఐ పార్టీ సర్పంచి అభ్యర్థి

 

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) చాతకొండ గ్రామ ప్రజలు తనని ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే చాతకొండ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వజ్జా ఈశ్వరి అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆశీస్సులతో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామంలో గత పాలకవర్గం చేయని, మిగిలిన పనులను పూర్తి చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని శుక్రవారం జరిగిన ప్రచారంలో గ్రామప్రజలకు హామీ ఇచ్చారు. పంచాయతీ బరిలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు ఆశీస్సులతో చాతకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడి గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు, అర్హులైన వారికి పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. యువతీ యువకులకు ఆయా కులాల కార్పొరేషన్ రుణాలను ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటుగా, గ్రామ పెద్దలు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest