తిమ్మాపూర్, నవంబరు 03 (తెలంగాణ వాణి ప్రతినిధి):తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ రిజర్వాయర్ సమీపంలో మట్టి మాఫియా అక్రమాలకు తెరలేపింది. ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీబీలతో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో నింపుతూ యథేచ్ఛగా తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం ఈ అక్రమ మట్టి తవ్వకాలపై తెలంగాణ వాణి ప్రతినిధి ఫొటోలు తీయడంతో అధికారులు స్పందించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. అధికారుల హెచ్చరికలతోనైనా మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందా అన్నది వేచి చూడాలి.




