UPDATES  

బియ్యం దొంగ ఆళ్ళ మురళి ని వెంటనే అరెస్ట్ చెయ్యాలి : యెర్రా కామేష్

కొత్తగూడెం, నవంబర్ 2 (తెలంగాణ వాణి) బియ్యాన్ని దారిమళ్ళించిన కేసులో ముద్దాయిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఆళ్ళ మురళి ని వెంటనే అరెస్ట్ చెయ్యాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణ 3వ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన క్రైమ్ నెంబర్: 202/2026 […]

అనుమతులు లేకుండానే జేసీబీతో తవ్వకాలు..ట్రాక్టర్లలో మట్టి తరలింపు

తిమ్మాపూర్‌, నవంబరు 03 (తెలంగాణ వాణి ప్రతినిధి):తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ సమీపంలో మట్టి మాఫియా అక్రమాలకు తెరలేపింది. ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీబీలతో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో నింపుతూ యథేచ్ఛగా తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం ఈ అక్రమ మట్టి తవ్వకాలపై తెలంగాణ వాణి ప్రతినిధి ఫొటోలు తీయడంతో అధికారులు స్పందించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. అధికారుల హెచ్చరికలతోనైనా మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందా అన్నది వేచి చూడాలి.