UPDATES  

 పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న మాట్లాడుతూ… మన భారతీయ సంస్కృతిలో ప్రతీ పండుగకు ఎంతో విశిష్టత ఉంటుందని, ఈ రక్షాబంధన్ సోదరభావానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యతకు నిదర్శనం ఈ పండుగ అని అన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రాఖీలు కట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జూలపల్లి ఖండ్ వ్యవస్థా ప్రముఖ్ చింతల ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు గండ్రాతి శ్రీలత, అనుమల్ల శారద, సిరిపురం సునీల్, చెక్కపల్లి అరుణశ్రీ, నాగెల్లి సౌజన్య తదితరులు పాల్గొన్నారు

Date of Publish : 27 August 2026, 3:54 pm Posted by : TELANGANA VANI

పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న మాట్లాడుతూ... మన భారతీయ సంస్కృతిలో ప్రతీ పండుగకు ఎంతో విశిష్టత ఉంటుందని, ఈ రక్షాబంధన్ సోదరభావానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యతకు నిదర్శనం ఈ పండుగ అని అన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రాఖీలు కట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జూలపల్లి ఖండ్ వ్యవస్థా ప్రముఖ్ చింతల ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు గండ్రాతి శ్రీలత, అనుమల్ల శారద, సిరిపురం సునీల్, చెక్కపల్లి అరుణశ్రీ, నాగెల్లి సౌజన్య తదితరులు పాల్గొన్నారు

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest