UPDATES  

NEWS

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ

 రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. రెండు కోచ్‌లు దగ్ధం

హైదరాబాద్ (తెలంగాణ వాణి) రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక బోగీలో మొదలైన మంటలు.. క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న మరో బోగీలోకి కూడా వ్యాపించాయి. ప్రమాద సంకేతాన్ని సకాలంలో గమనించిన లోకో పైలట్.. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు.

తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు బయలుదేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ (12431).. మధ్యప్రదేశ్‌లోని రత్లాం స్టేషన్ నుంచి కదిలింది. రైలు ఆలోట్ – విక్రమ్‌గఢ్ రైల్వే స్టేషన్ల మధ్యలో వెళ్తుండగా.. తెల్లవారుజామున రైలులోని B-1 కోచ్‌లో మొదట మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు మరో కోచ్‌కి కూడా విస్తరించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు అలుముకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే రైలును నిలిపివేసి, ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాయి. మంటలు వ్యాపించిన రెండు బోగీలను రైలు నుంచి వేరు చేశారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest