UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 లక్ష్యం దిశగా దూసుకుపోవాలి: జె.ఎన్.ఎస్ స్టేడియంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు !

క్రీడాకారులకు పోరాట సూర్తిని నింపిన సెక్రటరీ వెంకటస్వామి కోచ్ స్నేహ

హనుమకొండ:మార్చి08

(తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్)

హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ (జె.ఎన్.ఎస్) ఇండోర్ స్టేడియం ఆదివారం మహిళా చైతన్యానికి వేదికైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్టేడియంలో ప్రతిరోజూ కఠిన సాధన చేసే క్రీడాకారిణులు,మరియు క్రీడాకారులు తమ ప్రాక్టీస్ అనంతరం ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకున్నారు. క్రీడా ప్రాంగణమంతా బాలికల కేరింతలు, ఒకరికొకరు చెప్పుకున్న శుభాకాంక్షలతో సందడిగా మారింది.

ఈ వేడుకల్లో హనుమకొండ జిల్లా తైక్వాండో కార్యదర్శి గడ్డం వెంకటస్వామి మరియు కోచ్‌ గుడిపల్లి స్నేహ, మామునూరి సంపత్ లు మాట్లాడుతూ మహిళా దినోత్సవ విశిష్టతను మరియు ఐక్యరాజ్యసమితిలో మహిళల హక్కులను,అసమానతలను వివరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారకురాలైన ఉద్యమ నాయకురాలు క్లార జేట్కిన్ పోరాట స్ఫూర్తి ని వివరించారు.అంతేకాకుండా నేటి సమాజంలో క్రీడారంగం మహిళలకు కేవలం శారీరక దృఢత్వాన్నే కాకుండా అపారమైన గౌరవాన్ని,ఉన్నత భవిష్యత్తును కల్పిస్తోందని వారు పేర్కొన్నారు.బాలికలు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని,పట్టుదలతో శ్రమిస్తే అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించడం అసాధ్యమేమీ కాదని వారు ఆత్మవిశ్వాసాన్ని నింపారు. క్రీడల్లో రాణించడం ద్వారా క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు అలవడతాయని, ఇవి జీవితంలో ఏ రంగంలోనైనా విజయానికి పునాది వేస్తాయని హితబోధ చేశారు.ప్రపంచవ్యాప్తంగా మహిళా అథ్లెట్లు సాధిస్తున్న ఘనతలను ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, స్టేడియంలో శిక్షణ పొందుతున్న బాలికలు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మరియు క్రీడా శాఖ కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని భవిష్యత్తులో జిల్లాకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులైన బాలబాలికలు, ఎస్.అభిగ్న, ఎ.సహస్ర, బి.కీర్తిక,బి.జాహ్నవి

ఎం.సహస్ర సంపత్, ఎం.స్రమజ సంపత్, ఎ.హిమాన్ష్ ఎస్.శ్రీయాన్ కె.శ్రీరుద్రేశ్వర సాయి ఎం.యువిన్‌రాజ్ బి.ఈషాన్ పి.సంజయ్ కుమార్ తో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest