హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
రేపు జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు గడువు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహణ.. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్ ఎన్నిక పోలింగ్.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. 52.43 లక్షల మంది ఓటర్లకు గాను 2,996 వార్డుల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయనున్నారు
Post Views: 201
