ధర్మారం (తెలంగాణ వాణి)
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో గురువారం కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి పలువురు మండల దళిత బహుజన నాయకులు హాజరైనారు.అనంతరం పూలే, సావిత్రిబాయి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బొల్లి స్వామి మాట్లాడుతూ.. పూణే, బాంబే లోని 141 బాల బాలికల కొరకు పేద ప్రజల కొరకు దళిత బహుజనుల కొరకు విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు మహిళలు విద్యను అభ్యాసించి అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారంటే ఆ ఘనత సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఘనత అని అన్నారు. ఈ సందర్భంగా అన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా మొదటిసారి పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత ఈ దంపతులు ఇద్దరికీ చెందుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్తూరు గ్రామము నుండి వార్డు సభ్యులుగా గెలుపొందిన కాంపల్లి పోచయ్య, నేరువట్ల రవిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. మీ పై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రశజలకు సేవ చెస్తు వార్డు అభి వృద్ధికి కృషి చేయాలని కోరారు. దళిత బహుజనులూ.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విజ్ఞానం వైపు జ్ఞాన సంపార్జన కొరకు పాటు పడి జాతి అభి వృద్ధి కొరకు పాటు పడాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ తోడేటి రాజలింగయ్య గౌడ్, సుంచు మల్లేశం, మాజీ నీటి సంఘం చైర్మన్ చొప్పదండి మల్లేశం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నేరువట్ల రాజయ్య, నూనె వెంకట నరసయ్య ముదిరాజ్,మామిడిపల్లి సంతోష్, స్వామి, మామిడిపెళ్లి వినయ్,నేరువాట్ల మధు, వి హెచ్ పి ఎస్ మండల నాయకులు భూక్యా తిరుపతి నాయక్, లంబడి హక్కుల పోరాట సమితినాయకులు అజ్మీర రాజ్య నాయక్, రాజేశం, పాల్గొన్నారు.
