లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) సర్పంచిగా హమాలీ కాలనీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నూతన సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన సర్పంచ్ గుగులోత్ ప్రేమేందర్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భాద్యతలు చేపట్టిన సందర్భంగా సర్పంచ్ ప్రేమేందర్ మాట్లాడుతూ హమాలీ కాలనీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం సహకారంతో కలిసి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా చూస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సహకారంతో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేసి గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని సర్పంచ్ ప్రేమేందర్ అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తనతో కలిసి రావలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు సర్పంచ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్లపల్లి రాజు, వార్డు సభ్యులు కాట యాకయ్య, షేక్ రజియా, వర్సా రమణ,పునం వినోద, చింత లక్ష్మినారాయణ, తూర్పాటి కవిత, పంచాయతీ కార్యదర్శి భవాని, నాయకులు జ్యోతి బసు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
