UPDATES  

NEWS

తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్

 ఏటీఎంల చోరీ జరిగిన సంఘటన స్థలాలను పరిశీలించిన ఇంచార్జి పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర

ఐదు స్పెషల్ టీం ల ఏర్పాటు, ముమ్మరంగా తనిఖీలు

భద్రత బలోపేతం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం

నిజామాబాద్(తెలంగాణ వాణి) నిజామాబాద్ నగరంలో శనివారం తెల్లవారు జామున రెండు ఏటీఎంలలో చోరీ జరిగిన సంఘటన స్థలాలను శనివారం ఇంచార్జి పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర పర్యవేక్షించారు.

టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంగ్ర బ్రాంచ్ కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏ. టి. ఎమ్, టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద గల ఎస్.బి.ఐ బ్యాంక్ ఏ. టి. ఎమ్ లను గుర్తుతెలియని దొంగలు దాడి చేసి అందులో గల నగదును దాదాపు 30 లక్షల వరకు దోచుకుని పరారయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సంఘటనల స్థలాలను క్షుణ్ణంగా పర్యవేక్షించారు.చోరీ జరిగిన తీరును ఆయన సీరియస్ గాతీసుకొని తగు చర్యలు ఆదేశాలు చేశారు. ఏటీఎంల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, చోరీ జరిగిన విధానం, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను అధ్యయనం చేశారు.సీసీటీవీ ఫుటేజ్ సేకరణ: ఏటీఎం లోపలి మరియు పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషణకు ఆదేశించారు. క్లూస్ టీమ్, సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీస్ బృందాలతో మరియు 5 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు.అదేవిధంగా

రాత్రి వేళల్లో ముఖ్యంగా ఏటీఎంలు, బ్యాంకులు, జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ పెంచారు.జిల్లా లో ప్రవేశ–నిష్క్రమణ పాయింట్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఏటీఎం భద్రతను బలోపేతం చేయడానికి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకొని అలారం వ్యవస్థలు, అదనపు సీసీటీవీలు, లైటింగ్ మెరుగుదలపై సూచనలు ఇచ్చారు. జిల్లా లో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని ప్రజలకు భరోసా కల్పించారు. నిందితుల గుర్తింపు, పట్టుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ చర్యలతో నగరంలో భద్రత మరింత బలోపేతం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తునదని తెలియజేసారు. పర్యవేక్షణలో ఆయనతోపాటు నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి.బస్వారెడ్డి , నిజామాబాదు ఏసిపి రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, 4 టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ కుమార్ , టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, 4 టౌన్ ఎస్ఐ గంగాధర్ మరియు బ్యాంక్ మేనేజర్ శివకుమార్ తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest