ఉపసర్పంచ్ గా ఎలిగేటి మల్లేశం
ధర్మారం (తెలంగాణ వాణి)
ఎంతో ఉత్కంఠత నెలకొన్న ధర్మారం గ్రామ ఉపసర్పంచ్ పదవికి నేటితో తెరపడింది. ఈనెల 14న సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నిక జరుగగా ధర్మారం సర్పంచిగా దాగేటి రాజేశ్వరి విజయం సాధించారు. ఉప సర్పంచ్ స్థానానికి పలువురు పోటీ పడటంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐ ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి కె రమేష్ ఆధ్వర్యంలో గురువారం ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశమై సర్పంచ్ తో పాటు 8 మంది వార్డు సభ్యుల ఏకాభిప్రాయం మేరకు ధర్మారం ఉప సర్పంచ్ గా ఎలిగేటి మల్లేశం ఎన్నికైనట్లు ఎంపీడీవో ఐ ప్రవీణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. దింతో నాలుగు రోజులుగా ఉప సర్పంచ్ పదవి ఎవరికి దక్కుతుందో నన్న ఉత్కంఠతకు నేటితో తెరపడింది.
Post Views: 645

