UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) మండలంలోని బొమ్మరెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ ఆవరణలో మేడారం డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో పల్లె దవాఖానలో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో105 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా వ్యాధులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు.వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నరసింహారెడ్డి పొగాకు, వాటి ఉత్పత్తులు వాటిని వాడడం వలన వచ్చే రుగ్మతల గురించి క్షుణ్ణంగా వివరింఛి తగు సలహాలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వేముల వసంత, హెల్త్ సూపర్వైజర్ జయ, హెల్త్ అసిస్టెంట్ దామోదర్ రెడ్డి, ఏఎన్ఎం అరుంధతి, ఆశా కార్యకర్తలు లలిత,మంజుల, మల్లేశ్వరి, ప్రభుత్వ టీచర్ పిఎన్ఆర్ శర్మ, అంగన్వాడీ టీచర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest