ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్యది నిరుపేద కుటుంబం, గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ లో వాచ్ మెన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. సదయ్య భార్య మాధవి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి, వెంటనే మాధవి తన కుమారుడిని ఎత్తుకొని ఆరు బయటకు వచ్చి పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పి వేశారు. ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధం కాగా అందులో ఉన్న సామాన్లు మంటల్లో కాలి బూడిద అయ్యాయి. అనంతరం చుట్టుపక్కల ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పి వేశారు అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సదయ్య కుటుంబానికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం పంపించగా అట్టి రూపాయలను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాడే సూర్యనారాయణ శనివారం బుచ్చయ్య పల్లి గ్రామానికి వెళ్లి సదయ్య కుటుంబానికి మనోధైర్యం నింపి ఎంపీ పంపించిన 20 వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో పొన్నవేని స్వామి, బొంగాని సత్యనారాయణ ,నారలక్ష్మణ్, మేడే మహేందర్ ,కాల్వ పవన్ ,దుంపేటి సదానందం, గంప శ్రీధర్ ,పూసల సదానందం, ఆవుల రాజయ్య, పొడేటి అంజయ్య కంచు హనుమంతు, వేల్పుల స్వామి, బండారి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.



