UPDATES  

 టీజేటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడీ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరుబాట మొదలుపెట్టిన తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ సమస్యల సాధన కొరకు స్థాపించిన నూతన సంఘంలో ఉపాధ్యాయ సమస్యలపై, విద్యారంగ వ్యవస్థపై అవగాహన కలిగిన జాడీ శ్రీనివాస్ ను తొలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. వీరి నియామకం పట్ల ధర్మారం మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల జాడీ శ్రీనివాస్ అధినేత్రి కవితక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest