యాదగిరిగుట్ట (తెలంగాణ వాణి) యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బైండ్ల కళాకారుడు ఒగ్గు రాణా ప్రతాప్ బైండ్ల కు తెలంగాణ బైండ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిళ్ళ లక్ష్మణ్ రావు చేతుల మీదుగా బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఆదివారం రోజున నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నాగిళ్ళ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బైండ్ల సంక్షేమానికి 200 కోట్లు ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని, ప్రత్యేకంగా బైండ్ల కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో అవకాశాలు కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బైండ్ల కులస్తులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని బైండ్ల కులస్తులను వృత్తిని కాపాడాలని కోరారు. అనంతరం బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన వగ్గు రాణా ప్రతాప్ బైండ్ల కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కళాకారుల వృత్తి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించి వారికి అండగా ఉండాలని తెలిపారు. అనంతరం బైండ్ల కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వగ్గు రాణా ప్రతాప్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీకి వివిధ జిల్లాల బైండ్ల కళాకారులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నపాక మల్లేశం, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎస్పీ స్వామి, బైండ్ల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లమ్మ కంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
