ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులు ఫుట్బాల్ విభాగంలో అండర్ 19 లో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 7న కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్జిఎఫ్ అండర్ 19 బాలికల విభాగంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెలక్షన్స్ లో ధర్మారం ఆదర్శ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 10,11,12 తేదీలలో సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19 ఫుట్బాల్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు తరఫున పాల్గొంటారని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమరయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు అభినందించారు.



