బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిర్సే సంజీవ్
బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిర్సే సంజీవ్ గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిర్సే సంజీవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నానని, పార్టీలో ఉండి ప్రజలను పార్టీ చేస్తున్న మోసాలు చూడలేకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ మోసాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు బుద్ది చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు సురేందర్ యాదవ్, దేవేందర్, రాము, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



