UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

(స్వతంత్ర ట్రేడ్ యూనియన్స్)

ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షుడిగా పరసబోయిన. వీరబాబు నియామకం…

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయుఎంఎల్) పార్టీ అనుబంధ కార్మిక విభాగం

ఖమ్మం ప్రతినిధి: హనీఫ్ పాషా,అక్టోబర్-04 (తెలంగాణల వాణి)

ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షునిగా పరసబోయిన వీరబాబును, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా నియమించారు. ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

షేక్ బాజీ బాబా మాట్లాడుతూ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ మహమ్మద్ షకిల్ గారి ఆదేశానుసారం ఈ నియామకం చేయటం జరిగిందని, ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షునిగా ఎన్నికైన పరసబోయిన వీరబాబు కార్మికుల పక్షాన వారి సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయాలని, కార్మికులకు అండగా ఉండాలని,

 ఖమ్మం పట్టణంలో ఆటో యూనియన్ పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని, ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షునిగా ఎన్నికైన పరసబోయిన వీరబాబు మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ మహమ్మద్ షకిల్ గారికి, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా గారికి జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహీం గారికి, పార్టీ నగర కార్యదర్శి షేక్ హనీఫ్ మరియు షేక్ సర్వర్ పాషా లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 ఆటో యూనియన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తోటి కార్మికుల పక్షాన నిలబడి తమకు రావలసిన హక్కుల కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest