ఏకాత్మతా మానవతా వాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రం – అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ సెప్టెంబర్ 25: (తెలంగాణ వాణి ప్రతినిధి)
ఏకాత్మతా మానవతా వాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రం అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు.
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, మారుతీ నగర్ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అర్ముర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం ఎమ్మెల్యే ధన్ పాల్ గారు మాట్లాడుతు భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి పండిత్ దీన దయాల్ ఉపాధ్యాయ అన్నారు.
దీనదయాల్ జీ ఆశించినట్టుగా చిట్టాచివరి పేదోనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో భారత దేశాన్ని శక్తివంతమైన, సౌభాగ్యమైన దేశాంగా, ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా నెలబెట్టాలనే ఆశయంతో, జాతీయ పునరనిర్మాణం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు.దీన దయాల్ జీ రూపొందించిన ఏకాత్మతా మానవతా వాదం సిద్ధాంతం ఆధారంగానే బిజెపి మొదట 2 సిట్ల నుండి ఈ రోజు దాదాపు 300 సిట్లతో మూడు సార్లు వరసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.ఈ దేశంలో అట్టడుగు స్థాయి పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలనే దీన్ దయాల్ జీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు.గత 11 ఏళ్ల నరేంద్రమోదీ మన బిజెపి పరిపాలన చూస్తే అనేక విప్లవత్మక విజయాలతో పాటు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు.ప్రధానమంత్రి అవస్ యోజన,గరీబ్ అన్న కళ్యాణ్ యోజన ,ఆయుష్మాన్ భారత్,పసల్ భీమా యోజన,ఉజ్వల యోజన,సూకన్య సమృద్ధి యోజన,ముద్ర లోన్స్,విశ్వకర్మ యోజన ఇలా అనేక సంక్షేమ పథకాల ధ్వరా దేశ ప్రజలు లబ్దిపొందడం జరిగిందన్నారు.వికసిస్తున్న భారత దేశంలో బిజెపి సాధించిన విప్లవత్మక విజయాలు ఎన్నో ఉన్నా ఇంకా సాధించవలసినవి కూడా చాలా ఉన్నాయని భారత దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలన్న శ్యామప్రసాద్ ముఖర్జీ, దీనదయాల్ ఉపాధ్యాయ, అటల్ జీ అద్వానీలా కల సాకారం చేయాలన్నా,ఈ దేశాన్ని అఖండ భారతంగా తీర్చిదిద్దలన్నా కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో పని చేయాలనీ సూచించారు.
ఈ కార్యక్రమంలో అర్ముర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, ప్రధానకార్యదర్శులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ,పోతంకర్ లక్ష్మీనారాయణ,జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.