వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు
వేములవాడ,జూలై 16 (తెలంగాణ వాణి) :
వేములవాడ పట్టణంలోని వివేకానంద యూత్ (మార్కండేయ నగర్ కాలనీ) వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున పట్టణంలోని బద్ది పోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.తమ కాలనీ నుండి తలపై బోనాలతో,డప్పు చప్పులు,నృత్యాలు ఆట పాటలతో అమ్మవారి ఆలయం వరకు వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.నృత్యాలతో ఊరేగింపుగా సాగిన ఈ బోనాల ఊరేగింపు ప్రజల దృష్టిని ఆకర్షించింది.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తుంటామని, వర్షాలు బాగా పడి,పంటలు బాగా పండి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇట్టి బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ సభ్యులు,కాలనీవాసులు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 94