వృద్ధురాలు దారుణ హత్య
తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్,మే 26, చందుర్తి :
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో బొల్లు మల్లవ్వ (60 సంవత్సరాలు) అనే మహిళ వృద్ధురాలు పెద్దమ్మ గుడి సమీపంలో దారుణ హత్యకు గురైంది.గుర్తుతెలియని యువకుడు కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమెను అతి కిరాతకంగా నరికి చంపాడు.సమాచారం అందుకున్న చందుర్తి మండల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 167