UPDATES  

NEWS

ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌) వితరణ దళితుల ఆత్మగౌరవ సభ కరపత్రాన్ని మంత్రికి అందించిన ఎమ్మార్పీఎస్ నేతలు గొర్రెల పెంపకం దారులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల అల్పోర్స్ జూనియర్ కళాశాల లో వందేమాతరం వేడుకలు రహదారిపై బైఠాయించిన మొక్కజొన్న రైతులు శ్రీచైతన్య స్కాలర్షిప్ టెస్టులో మొదటి బహుమతి పొందిన జి వర్షిని టీజేటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్ వనమా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బట్టు మంజుల మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నెరువట్ల రాజయ్య చుంచుపల్లిలో జననేత వనమా జన్మదిన వేడుకలు

 క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి : యెర్రా కామేష్

 కొత్తగూడెం (తెలంగాణ వాణి)

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని సీనియర్ బాక్సర్, జిల్లా బాక్సింగ్ ప్యాట్రాన్ యెర్రా కామేష్ అన్నారు. మంచిర్యాలలో శనివారం నుండి ప్రారంభమైన టైసన్ కప్ ఓపెన్ స్టేట్ బాక్సింగ్ పోటీలలో భాగంగా బౌట్ పోటీలను ప్రారంభించారు. ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రతీ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని గెలుపొందిన వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఓటమి చెందిన వారు మరింత సాధన చేసి భవిష్యత్ లో గెలుపొందుటకు కృషి చేయాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో వెళ్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో బాక్సింగ్ పోటీలను నిర్వహించడం ఆషామాషీ విషయం కాదని బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు. బాక్సింగ్ పోటీలు విజయవంతం కావాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ అసోసియేషన్ వారు యెర్రా కామేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎల్లయ్య బండారి, సర్వేశ్, వినయ్, బాబీ, సోనూ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest