UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 TUWJ H143 రజతోత్సవ వేడుకలను జయప్రదం చేద్దాం

హుజూరాబాద్ లో నియోజకవర్గ స్థాయి సమావేశం

టీజెఫ్ రజతోత్సవ వేడుకలకి భారీగా తరలి వెళ్ళాలని తీర్మానం

హుజురాబాద్ (తెలంగాణ వాణి)

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూ డబ్యూ జే -హెచ్ 143 ఐజె యు) హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాల కృష్ణ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టులు మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు.

సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నాయకత్వంలో మే 31, 2025న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజెఫ్) 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ బలోపేతం కోసం అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసే ఏకైక సంస్థ టీయూడబ్యూ జే -హెచ్ 143 అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజెఫ్ రజతోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా నుండి భారీ సంఖ్యలో జర్న లిస్టులు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌లో యూనియన్ నూతన అడ్‌హాక్ కమిటీని ప్రకటించారు. కన్వీనర్ గా గూడూరి కొండాల్ రెడ్డి, కో కన్వీనర్ లుగా శ్యామ్, శ్రీనివాస్ లని నియమించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే 15 రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అలానే మే 31,2025న హైదరాబాద్‌లో జరిగే టీజెఫ్ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్‌ లోని పలువురు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు యూనియన్ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి బోనాల తిరుమల్, కోశాధికారి జేరీపోతుల సంపత్, సీనియర్ జర్నలిస్టులు మండల యాదగిరి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest