UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 గాయని మధుప్రియచే రజనీ ఫెర్టిలిటీ సెంటర్ లో లక్కీడ్రా

మగాడి విజయం వెనుక స్త్రీ, స్త్రీ శక్తి వెనుక పురుషుడు ఉండాల్సిందే : గాయని మధు ప్రియ

కరీంనగర్ మార్చి 08 (తెలంగాణ వాణి)

ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే, ప్రతి మహిళ శక్తి వెనుక పురుషుడి హస్తం తప్పనిసరి అని ప్రముఖ గాయని మధు ప్రియ అన్నారు. శనివారం స్థానిక రెనీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో రజని సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మ అని, ఆడతామో అందాల ఆనంద పౌర సమాజ నిర్మాత అని తెప్పాల్సిన పని లేదన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి ఏట ఒక ప్రత్యేక ఉచిత ఫర్టిలిటీ సేవలు పొందడానికి అర్హులైన 10 మందిని లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేసుకొని లక్షల విలువైన ఆధునిక వైద్య సేవలను ఉచితంగా కల్పిస్తున్న రెనీ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్ బంగారి స్వామి, డైరెక్టర్ డా.రజనీ ప్రియదర్శిని దంపతులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాట, పాట కలగలిపి అమ్మ గొప్పతనాన్ని ఆవిష్కరించిన ఉచిత సంతాన సాఫల్య వైద్య సేవలు పొందే పది మందిని లక్కీడిప్‌ ద్వారా 348 మందిలో 10 మందిని ఎంపిక చేసారు. డా రజనీ ప్రియదర్శిని మాట్లాడుతూ తమ అత్త పేరిట ప్రతి ఏట 20 లక్షల విలువైన సంతాన సాఫల్య ఉచిత సేవలు అందించడం చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. డా బంగారి స్వామి మాట్లాడుతూ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చిన సమాజానికి ఎంతో రుణ పడి ఉన్నామని,తమ ఆసుపత్రి ద్వారా ఏడాదికి 50 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మధుప్రియను ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సత్కరించారు. డా కెప్టెన్‌ బుర్ర మధుసూదన్ రెడ్డి సమన్వయ కర్తగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా రవీంద్రారెడ్డి చారి, డీన్ డా.మునీష్, గుండె వైద్య నిపుణులు డా.దినకర్ తాటిమట్ల, జనరల్ ఫిజీషియన్ డా.నిఖిల్ లక్ష్మణ్, డా లతీష్ రెడ్డి, నాన్ క్లినికల్ డైరెక్టర్ మేకల అరవింద్‍ రావు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest