UPDATES  

NEWS

ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్ యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్ పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్ పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు  పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు. పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్. ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తో మొక్కను నాటిన మొక్కల రాజశేఖర్  తెలంగాణ వాణి జర్నలిస్ట్ కు రాష్ట్రస్థాయి గౌరవం

 రాజీ మార్గమే రాజా మార్గం : జిల్లా జడ్జి సునీత కుంచాల

శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం 

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి 

నిజామాబాద్ (తెలంగాణ వాణి)

ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ కోర్టులలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. భూమి తగాదాలు, చెక్ బౌన్స్, బ్యాంక్ లీగల్ యాక్షన్ రుణాలకు సంబంధించి మైంటనేన్స్ తదితర కేసులు పరిష్కరించబడతాయన్నారు. అదేవిధంగా కొందరు వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం ఉండి ఇక్కడికి వచ్చే అవకాశం లేని వారికి లోక్ అదాలత్ ద్వారా వారికి వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. అలాంటివారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీ పద్ధతిలో కేసు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇరుపక్షాల వారు రాజీ ఉన్నప్పుడే రాజీ మార్గం సులువు అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను సంబంధించి నష్ట పరిహారం కోసం వేసిన కేసులలోని బాధితులు న్యాయ సేవా సంస్థను ఆశ్రయించితే ఒక నెల రోజుల వ్యవధిలో పూర్తి మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కేసుల్లో కూడా న్యాయ సేవాసంస్థను సంప్రదిస్తే వారికి కూడా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. 3 నెలలకు ఒక సారి వచ్చే జాతీయ లోక్ అదాలత్ ను కేసులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు వినియోగించుకోవాలాన్నారు. ఈ సమావేశంలో న్యాయా సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, కోర్టు సిబ్బంది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest