విదేశాలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు భారత దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచేలా చూడాలి
అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ (తెలంగాణ వాణి)
భారత దేశం కళలకు పుట్టినిల్లని ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పెద్ద పెద్ద నగరాలకు పరిమితం అనే అపోహ ఉండేదని ఇన్ఫినిటీ తో ఇందూరుకు తీసుకువచ్చిన యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో ఇన్ఫినీటి హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆధ్వర్యంలో ఫ్యాషన్ డిజైనింగ్ భారత్ టెక్స్ టైల్ ఎక్స్పో, కాన్సెప్ట్ టు క్రియేషన్ అనే కార్యక్రమాన్ని కళాశాల విద్యార్థులచే కలశాల చైర్మన్ రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మాజీ జెడ్పి చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, మాజీ నగర మేయర్ నీతూ కిరణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..విదేశాలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు భారత దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచేలా చూడాలన్నారు.ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బెంగళూరు, ముంబాయి, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లాంటి నగరాలకి పరిమితమైందని, మన జిల్లాలో కూడా విద్యార్థులను తయారు చేయవచ్చన్న సంకల్పంతో చైర్మన్ రత్నాకర్ ఇన్ఫినిటీ కళాశాల ను ప్రారంభించి45 దేశాలలో వారి విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయం అన్నారు. నిజామాబాద్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్న రత్నాకర్ ను అభినందిస్తున్నమన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే
చాలా కాస్లీ గా ఉంటుందని అపోహతో ఉన్నారని, నిజామాబాదులో విద్యార్థులకు తక్కువ ఫీజుతో అందించడం తో చాలామంది విద్యార్థులు హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చదవడానికి ముందుకొస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, వరంగల్ లో ఉన్న టెక్స్ టైల్ పార్క్ ను ఇన్ఫినిటీ కళాశాల విద్యార్థులచే సందర్శించాలని సూచించారు. ఇన్ఫినిటీ కళాశాల చైర్మన్ రత్నాకర్ మాట్లాడుతూ..ఫ్యాషన్ డిజైనింగ్ లో అవకాశాలకు కొదవలేదన్నారు. మా మీద నమ్మకంతో విద్యార్థులను మా కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటివరకు 45 దేశాలలో మా విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. 2016 సంవత్సరంలో కళాశాలను నెలకొల్పామని, ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరం లోకి అడుగుడుతున్నమన్నారు. ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మా విద్యార్థులు తయారుచేసిన డిజైనింగ్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ నీతూ కిరణ్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు గుజ్జేటి నర్సయ్య, బీసీటియు అద్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, అధ్యాపక బృందం ,మాధురి అక్షర తదితరులు పాల్గొన్నారు.