UPDATES  

NEWS

కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్ ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థుల ఐఎన్‌టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభ.. సారపాకలో బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న టి ఎస్ యు టి ఎఫ్ భద్రాది జిల్లా నాయకులు  లక్ష్యం దిశగా దూసుకుపోవాలి: జె.ఎన్.ఎస్ స్టేడియంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ! ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్

 డీఓటీ అడ్వైజరీ.. టెలికంశాఖ పేరిట ఫేక్ కాల్స్.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు మొబైల్ ఫోన్ల యూజర్లకు ఫోన్ చేసి..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మొబైల్ నంబర్ డిస్ కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు.

దీనిపై కేంద్ర టెలికం శాఖ (డీవోటీ) మొబైల్ ఫోన్ యూజర్లకు అడ్వైజరీ జారీ చేస్తూ ఇవన్నీ ఫేక్ కాల్స్ అని స్పష్టం చేసింది. అటువంటి ఫోన్ కాల్స్ రాగానే రిపోర్ట్ చేయాలని సూచించింది. విదేశీ మొబైల్ ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్ చేసి మొబైల్ యూజర్లను తాము ప్రభుత్వాధికారులం అని నమ్మిస్తున్నారని శుక్రవారం జారీ చేసిన అడ్వైజరీలో తెలిపింది.

ఇటువంటి కాల్స్ చేసిన సైబర్ మోసగాళ్లు.. యూజర్ల వ్యక్తిగత సమాచారం తస్కరించి ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుంటారని టెలికం శాఖ హెచ్చరించింది. టెలికం శాఖ తరఫున ఫోన్ చేయడానికి తాము ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదని స్పష్టం చేసింది. ఇటువంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం షేర్ చేసుకోవద్దని డీవోటీ వివరించింది.

మొబైల్ ఫోన్ యూజర్లు తమకు వచ్చిన మోసపూరిత ఫోన్ కాల్స్ విషయమై వెంటనే సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsathi.gov.in)లో ఫిర్యాదు చేయాలని డీవోటీ పేర్కొంది. ఇదే వెబ్ సైట్ లో ‘ నో యువర్ మొబైల్ కనెక్షన్’ అనే ఆప్షన్ క్లిక్ చేసి యూజర్లు తమ ఫోన్ కనెక్షన్ల వివరాలు తెలుసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇప్పటికే సైబర్ మోసాల భారీన పడితే 1930 హెల్ప్ లైన్ నంబర్ కి ఫోన్ చేయాలని, www.cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest